NAA BAAGASWAMINI SONG LYRICS | Telugu Christian Wedding Song

“Naa Baagaswamini” is a soulful Telugu Christian wedding anthem sung by Enosh Kumar, featuring Heaven Joy and Joy Onesimus. This song beautifully captures the sacredness of marriage and the divine blessing of a God-ordained union.

Naa Baagaswamini Song Lyrics Telugu

నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు
దేవా నా జీవితమంతా ఏకమై నడిచెదను
నా ప్రియునితో నన్ను జతపరిచియున్నారు
దేవా నా జీవితమంంతా ఏకమైయుండెదను
నాయందు నీ వివాహకార్యమును
విశ్వాసముతో స్వీకరించెదన్ (2)

పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను
పరమాత్మునికార్యముగా ఈ యాత్రను కొనసాగింతును (2) / “Yeshua”

వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని
నా తల్లితండ్రిని విడిచి
నిన్ను హత్తుకొందును
క్రీస్తు యేసు సంఘమునకు
శిరస్సై యుండులాగున
నేను నా భార్యకు శిరస్సుగ ఉందును
నా ప్రియసఖివే నాలో సగభాగమై
యేసును వెంబడించు సహవాసివై
అంతము వరకు నీకు తోడై యుండి
క్రీస్తుని నీడలో ఫలియించెదము (పరలోక)

వివాహము అన్నిటికన్న ఘనమైనది అని
నేను నా స్వజనము మరచి
నిన్ను హత్తుకొందును
సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా
నేను నా భర్తకు లోబడియుండెదను
నను ప్రేమించి నను ధైర్యపరచి
కలువరి ప్రేమే మూల స్థంభమై
క్రీస్తు ప్రణాళికలో నీకు సహకారినై
పరిశుద్ధ గృహమును నేను నిర్మించెదను (పరలోక)

నేను ఇది మొదలుకుని
చావు మనలను ఎడబాపు వరకు
దేవుని పరిశుద్ధ నీ దయను చూపున
మేలుకైనను కీడుకైనను
కలిమికైనను లేమికైనను
వ్యాధియందును ఆరోగ్యమందును
నిను ప్రేమించి సంరక్షించుటకై
నా భార్యగా చేసుకొనుచున్నాను
నీ చొప్పున జరిగింతునని
ప్రమాణము చేయుచున్నాను
నా భర్తగా చేసుకొనుచున్నాను
నీ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను…

Song Shorts

Naa Baagaswamini Song

Filled with heartfelt lyrics and a melodious tune, “Naa Baagaswamini” expresses gratitude and joy in finding a life partner chosen by God. With rich vocals and meaningful visuals, it stands as a perfect dedication for Christian wedding ceremonies, symbolizing love, faith, and commitment.